తెలంగాణ ప్రభుత్వం స్వల్పకాలిక లక్ష్యాలతో పనిచేయదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీస్‌లో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకునేందుకు సహజ విధానాల రూపకల్పనతో కూడిన తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీ 2023-28ని మంత్రి ఆవిష్కరించారు. ఇది దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన కూల్ రూఫ్ పాలసీ అని అన్నారు. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో కూల్‌రూఫ్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని, అనుసరించేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. పాలసీలు, చట్టం చేయడం చాలా సులువని, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు.
2030 నాటికి రాష్ట్రంలో 300 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ టాప్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్ రూఫ్ ఏర్పాటును తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కూల్‌రూఫ్ వల్ల మీటరుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. కూల్‌రూఫ్ పెయింట్ వేయడం వల్ల కరెంటు చార్జీలు ఆదా అవుతాయని చెప్పారు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌కు హైదరాబాద్‌లో రెండు ప్లాంట్‌లు ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్ ఆన్నారు. ప్రభుత్వం కట్టే డబూల్ బెడ్‌రూంలకు కూడా కూల్ పెయింట్స్ చేస్తామని అన్నారు. హైదరాబాద్ కోరకు 500ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు తెస్తున్నామని తద్వారా గాలి శబ్ధకాలుష్యాలను తగ్గించుకోవచ్చన్నారు.
తెలంగాణలో ఉన్న ప్రగతిశీల ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. అందుకే దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో నిర్మాణ రంగం దూసుకుపోతుందని తెలిపారు. దేశంలోనే అత్యధిక ఆఫీస్ స్పేస్ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేసామని ఈసందర్భంగా గుర్తు చేశారు. కూల్ రూఫ్ పెయింట్స్ ద్వారా మిడిల్ క్లాస్ కొంత మినహాయింపులు ఇస్తున్నామని…600గజాల లోపు పని చేసే వారికి ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపారు. గత కొంతకాలంగా అకారణంగా గుండెజబ్బులు వస్తున్నాయని అయితే సీపీఆర్ ద్వారా వారిని రక్షించుకోవాలని సూచించారు. నగరంలోని పలు అపార్ట్మెంట్‌లో సీపీఆర్ పద్ధతిని కొనసాగిస్తున్నమని తెలిపారు.
ఇవి కూడా చదవండి…
SSC Exams:విద్యార్థులకు ఆల్ ది బెస్ట్
China:విద్యార్థులకు లవ్ హాలీ డే
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు..