దిగువ, మధ్య తరగతి ప్రజలకు అత్యంత చౌకైన రవాణా సాధనం రైల్వే వ్యవస్థ. అయితే దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా 2003లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) వ్యవస్థను తీసుకువచ్చింది. దీని ద్వారా నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లాలని అనుకునే వారికి చౌవకైన ప్రయాణంను అందుబాటులోకి తీసుకువచ్చినట్టయింది. అయితే మరోసారి 2014లో రెండో దశ ఎంఎంటీఎస్ కూత పెట్టేందుకు సిద్ధమవుతుంది. లక్షలాది ప్రజలు సంవత్సారాల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. ఈ నెల 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా రెండో దశ ఎంఎంటీఎస్ ప్రారంభించనున్నారు.
మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్, మేడ్చల్-సికింద్రాబాద్-తెల్లాపూర్ వరకు ఎంఎంటీఎస్‌ను ప్రారంభించనున్నారు. దీంతో 40 నుంచి 50 కిలో మీటర్ల దూరంను కేవలం రూ.10-15 టిక్కెట్‌తో ప్రయాణించవచ్చు. కొత్తగా ప్రారంభించే మేడ్చల్- సికింద్రాబాద్‌లో మొత్తం దూరం 28కిమీ పరిధిలో లాలాగూడ గేట్, మల్కాజ్గిరి, దయానంద్‌నగర్, సఫిల్‌గూడ, ఆర్కేపురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్, అల్వాల్, బొల్లారం బజార్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఫలక్నామ వరకు ఎంఎంటీస్ ఉండటం వల్ల అదనంగా ఉందానగర్ పొడగింపు జరిగింది. అలాగే లింగంపల్లి నుంచి తెల్లాపూర్ వరకు అదనంగా సేవలను విస్తరించారు. నగరం నలూ దిశలా ఎంఎంటీఎస్ సేవలను త్వరలో మిగతా మార్గాల్లోనూ అందుబాటులోకి తీసుకోస్తామని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఏకే గుప్తా తెలిపారు.
ఇవి కూడా చదవండి…