టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనకు ఏటువంటి సంబంధం లేని టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహరంలో గత కొన్ని రోజులుగా నాపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తనకు ఏటువంటి సంబంధం లేని విషయంలో నాపేరును ప్రస్తావించినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో రూ.100కోట్లు పరువు నష్టం దావా వేయనున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీ వ్యవహారంపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయా కక్ష సాధింపు పేరుతో నా పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇంకా…సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న నా పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతో బండి సంజయ్ రేవంత్రెడ్డి పదే పదే అబద్దాలు మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ఆరోపణలు చేసే హక్కు వారికి లేదన్నారు. ఐపీసీ సెక్షన్లు 499,500 ప్రకారం పరువు నష్టం దావాకు నోటీసులు పంపించా. ఎలాంటి ఆధారాలు లేని సత్యదూరమైన ఆరోపణలు మానుకోవాలి. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో రూ.100కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కొవాల్సి వస్తుందని లేఖలో మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి…