rahulgandhi:రాహుల్ క్షమాపణలు చెప్పాలి..లేదంటే..!

37
- Advertisement -

పార్లమెంట్‌కు అనర్హతకు గురైన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ..ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్‌సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మహారాష్ట్ర ప్రజలు రాజకీయ నాయకులు తీవ్రంగా ఆక్షేపించారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై వీర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రముఖ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతపై తీవ్రంగా మండిపడ్డారు. దేశ భక్తుడు హిందూ సిద్ధాంత కర్త అయిన సావర్కర్ ఎప్పుడూ బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే..తన తాత గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన పత్రాలను చూపించాలన్నారు. లేని యెడల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

రాహుల్‌ మాటలు పిల్లల మాటల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రచారం కోసం దేశభక్తులు పేర్లను వాడుకోవడం తపప్పని దుయ్యబట్టారు. చాలా పెద్ద నేరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 2019లో ఎన్నికల సందర్బంగా మోదీ అనే ఇంటి పేరును కించపర్చారన్న కేసుల్లో రాహుల్‌కు రెండేళ్లు జైలు శిక్ష పడటంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను కూడా ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిసులు పంపించారు.

ఇవి కూడా చదవండి…

Harish Rao:మాతా శిశు మరణాలు తగ్గుముఖం

D Srinivas: కాంగ్రెస్‌లో చేరికపై డీఎస్ క్లారిటీ…

KTR:ఫ్లై ఓవ‌ర్ల కింద క్రీడా వేదిక‌లు..

- Advertisement -