వెల్లుల్లితో ప్రయోజనాలు!

112
- Advertisement -

వెల్లుల్లి మనం వంటింట్లో విరివిగా ఉపయోగించే పదార్థం. కూరల యొక్క రుచిని పెంచడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే చాలమంది వెల్లుల్లిని తినడానికి ఇష్టపడరు. దీనికి కారణం వెల్లుల్లిని.. నమిలినప్పుడు వచ్చే వాసన వల్ల కొంతమంది అలెర్జీగా ఫిల్ అవుతారు. కానీ వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసే దివ్యఔశదం గా వెల్లుల్లిని భావిస్తారు ఆయుర్వేద నిపుణులు.వెల్లుల్లిలో విటమిన్ బి1, బి6, విటమిన్ సి, వంటి వాటితో పాటు మాంగనీస్, కాల్షియం, కాఫర్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లామెంటరీ, యాంటీ బాక్టీరియల్, గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

అందువల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, ఉబుసం, జ్వరం, నులి పురుగులు, కాలేయం, పిత్తాశయ సమస్యలు, వంటి వాటిని దూరం చేయడంతో పాటు రోగనిరోదక శక్తిని కూడా పెంచుతాయి. ఇక శరీరంలోని వాపులను నొప్పులను తగ్గించడంలో కూడా వెల్లుల్లి సహాయ పడుతుంది. వెల్లుల్లి యొక్క రెండు లేదా మూడు రెబ్బలను పేస్ట్ లా చేసుకొని దానిలో తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం పడగడుపున తీసుకుంటే రోగ నిరోదక శక్తి పెరగడంతో పాటు, ఉబ్బుసమ్, దగ్గు వంటివి కూడా దూరం అవుతాయి. వెల్లుల్లిని మెత్తగా నూరుకోని పాలలో గాని, లేదా గురు వెచ్చని నీటితో గాని కలిపి తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

ముఖ్యంగా బరువు తగ్గాలని భావించే వారు నిమ్మకాయ రసంలో కొద్దిగా వేడినీళ్ళు కలిపి అందులో వెల్లుల్లి రసం కలుపుకొని ఉదయం మరియు సాయంత్రం తప్పనిసరిగా సేవిస్తే.. త్వరగా బరువు తగ్గవచ్చట. ఇంకా వెల్లుల్లి రసం ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు కూడా దురమౌతాయి. ప్రోస్టేట్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి దరిచేరకుండా చూడడంలో కూడా వెల్లుల్లి కీలక పాత్ర వచింతుందట. అందుకే వెల్లుల్లిని తినడంలో అశ్రద్ద వహించరాదని, వెల్లుల్లిని నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:Chandrababu:బాబు మళ్లీ జైలుకెళ్ళాల్సిందేనా?

- Advertisement -