Padangusthasana: పదంగుష్టాసనం వేస్తే ఎన్ని ఉపయోగాలో!

40
- Advertisement -

పురుషులకు నేటి రోజుల్లో చాలా సమస్యలు వేధిస్తుంటాయి. నిరంతర పని ప్రభావం వల్ల తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా పురుషులకు తలెత్తుతున్న సమస్యలలో శృంగార సమస్యలే అధికం. వీర్య కణాల వృద్ది తగ్గిపోవడం, అంగస్తంబన, శిగ్రస్కలనం.. వంటి సమస్యలతో పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతోంది. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి మెడిసన్ తో పాటు ప్రతిరోజూ యోగా చేయడం కూడా ఎంతో అవసరం. యోగాలో ” పదంగుష్టాసనం ” పురుషుల్లోని శృంగార సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అంతే కాకుండా కాళ్ళు చీలమండ, కాలి వెళ్ళు బలపడతాయి. ఈ ఆసనంలో నాడీ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మహిళల్లో ఒత్తిడి, ఆందోళన లను దూరం చేస్తుంది.

పదంగుష్టాసనం వేయు విధానం

ఈ ఆసనంలో మొదటగా కూర్చున్న స్థితిలో ఉన్న తరువాత ఎడమ కాలును వంచి పిరుదుల వద్దకు తీసుకురావాలి. ఆ తరువాత కుడి కాలును వంచి పాదాన్ని ఎడమ కాలు తొడపై ఫోటోలో చూపిన విధంగా ఉంచాలి. కుడి కాలు తొడ భాగం భూమికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం బరువంత కుడి కాలు తొడపై మరియు ఎడమ కాలు పాదాల పడుతుంది. ఎడమ కాలి వేళ్ళతో శరీర బరువును బ్యాలెన్స్ చేస్తూ శ్వాస క్రియను నెమ్మదిగా జరిగించాలి. కొంత సమయం తరువాత మళ్ళీ కాళ్ళు మార్చుతూ ఇదే ప్రక్రియను కొనసాగించాలి. ఇలా వీలైనంతా సమయంలో ఈ ఆసనం వేయాలి.

జాగ్రత్తలు

ఈ ఆసనం వేసేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఒంటికాలుపైనే శరీర బ్యాలెన్స్ ఉండడం వల్ల శరీరాన్ని అటు ఇటు కదలకుండా చేసుకోవాలి. ఈ ఆసనంలో ఎక్కువ సేపు శ్వాస పట్టి ఉంచరాదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -