దసరా ట్విస్ట్ అదేనా?

36
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మాస్ అవతార్ తో చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘దసరా’ ఈ నెల 30న థియేటర్స్ లోకి రాబోతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం నాని పాన్ ఇండియా ప్రమోషన్స్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. నార్త్ , సౌత్ అంతా తిరుగుతూ దసరా ను సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కొత్త దర్శకుడు ఇంటర్వల్ కి ముందు ఎవరూ ఊహించని ట్విస్ట్ పెట్టాడని తెలుస్తుంది.

సినిమాలో ధరణి కి ప్రాణ స్నేహితుడు సూరి పాత్ర ఉందట. ఆ పాత్రను దీక్షిత్ శెట్టి అనే యాక్టర్ చేశాడు. సినిమాలో వీరిద్దరి ఫ్రెండ్ షిప్ ఓ రేంజ్ లో ఉంటుందని కానీ ఇంటర్వల్ లో సూరి డెత్ తో ట్విస్ట్ ఉండనుందని లీకైంది. తాజాగా సెన్సార్ బోర్డ్ సభ్యులు కూడా సినిమా చూసి సూరి డెడ్ బాడీ ను చూపించిన షాట్ పై అభ్యంతరం తెలియజేయడంతో ఆ ట్విస్ట్ లీకయిపోయింది.

అయితే సూరి ఎందుకు చనిపోతాడు ? అతన్ని ఎవరు హత్య చేశారు ? అనేది ఆసక్తిగా ఉండనుందని తెలుస్తుంది. అలాగే కీర్తి సురేష్ కేరెక్టర్ తో కూడా ఓ ట్విస్ట్ ఉంటుందని ఆ సీన్ కి ప్రేక్షకులు షాక్ అవుతారని తెలుస్తుంది. దసరా మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో నాని బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటాడని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇక భారీ వసూళ్లు రావడం పక్కా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -