ustad:సెట్స్ పైకి పవన్ ఉస్తాద్.. డేట్స్ ఫిక్స్

40
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌ లో రాబోతున్న ఉస్తాద్ భగత్‌సింగ్ గురించి మొత్తానికి మరో అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పై తాజాగా ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 5 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని మూవీ టీం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సెట్టింగ్ పనులు ప్రారంభించినట్టు సమాచారం. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వరుసగా 10 రోజుల పాటు డేట్స్ ఇచిన్నట్లు తెలుస్తోంది. ముందుగా యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తారట.

యాక్షన్ ఎపిసోడ్ అనంతరం పవన్ కళ్యాణ్ పై సోలో సాంగ్ ను షూట్ చేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను మేలో ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మే నెలలో కూడా ఈ సినిమా కోసం 15 రోజుల పాటు డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఖ‌రారైన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ మొదట అనుకున్న కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్క హీరోయిన్ కే స్కోప్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఫ్రెష్ గా స్టార్ట్ కాబోతోంది పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ సినిమా. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి…

Pooja Hegde:పూజా హెగ్దే ప్రేమ పురాణం మళ్లీ వైరల్

ntr30:’ఎన్టీఆర్ 30′ కి అదనపు అందాలు!

Manchu Brothers:మంచు బ్రదర్స్ .. గొడవేంటి?

- Advertisement -