ప్రజా సంక్షేమంలో తెలంగాణ భేష్‌.. ఆరవింద్‌

48
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ లో నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కంటి వెలుగు, సాగునీటి రంగంలో చేసిన అద్భుతమైన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణలో సాగునీటి రంగంలో అద్భుతమైన పనులు జరుగుతున్నాయన్నారు. గతంలో నేను ఐక్యాంప్‌ సందర్శనకు సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు తెలంగాణలో పర్యటించిన సంగతిని గుర్తు చేశారు.

తెలంగాణలో 3 నుంచి 4 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని అవసరమైన వారికి కళ్లద్దాల పంపిణీ మరియు కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారని తెలిపారు. ఆ సమయంలో ఢిల్లీలో నేను పంజాబ్‌లో సీఎం మాన్‌ అమలు చేస్తామని చెప్పాము. ఈ మధ్య కాలంలో పంజాబ్ సీఎం మరోసారి తెలంగాణకు వెళ్లిన సంగతి గుర్తు చేశారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య కావున వేరొకరి నుంచి మనం ఎందుకు నేర్చుకోకూడదని అన్నారు.

ఇవి కూడా చదవండి…

తెలంగాణలో ఆరోగ్య మహిళే లక్ష్యం: హరీశ్‌

భద్రాచలం…రాములోరి పెళ్లికి సీఎం

కరీంనగర్‌..ఏరియల్ వ్యూ చేయనున్న సీఎం

- Advertisement -