రాయ్‌బరేలి హాకీ స్టేడియంకు రాణి పేరు..

46
- Advertisement -

భారతదేశం జాతీయ క్రీడా అంటే హాకీ ఠక్కున చెప్పేస్తాము. కానీ ప్రస్తుత రోజుల్లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ కంటే హాకీకి చాలా తక్కువగా ఉంది. కానీ రాణిరామ్‌పాల్‌…హర్యానాకు చెందిన ఈ క్రీడాకారిణి అత్యంత పిన్న వయస్సులో భారతదేశంకు ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈమె సారథ్యంలో 2018లో ఆసియాన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా కెప్టెన్‌గా వ్యవహరించింది. 2020 టోక్యో ఒలంపిక్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఈ విషయాలను ఎందుకు చర్చించుకుంటున్నామని అనుకుంటున్నారా..?

రాణి రామ్‌పాల్ యాదవ్‌ పేరును తొలిసారిగా రాయ్‌బరేలిలోని హాకీ స్టేడియంకు ఈమె పేరును ప్రకటించారు. ఇక నుంచి రాయ్‌బరేలి రాణి గర్ల్స్‌ హాకీ టర్ఫ్‌ అని పిలువాలని ప్రకటించారు. ఇదే విషయాన్ని రాణి సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఇది భావోద్వేగంతో కూడిన సమయమని…ఇలాంటి ఆరుదైన గౌరవం లభించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇది తరువాతి తరంకు మార్గదర్శకంగా నిలిచే విధంగా రాయ్‌బరేలి ఎమ్‌సీఎఫ్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. భారతదేశంలో ఇలాంటి గౌరవం పొందడం తొలిసారి అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి…

సిక్స్ కొట్టాలంటే సచిన్ పర్మిషన్‌.!: సెహ్వాగ్‌

ఐపీఎల్..ఉప్పల్‌లో 7 మ్యాచ్‌లు

భద్రాచలం…రాములోరి పెళ్లికి సీఎం

- Advertisement -