భద్రాచలం…రాములోరి పెళ్లికి సీఎం

53
- Advertisement -

ఈనెల 30న భద్రాచలంలో జరగబోయే శ్రీసీతారాముల కళ్యాణమహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు బుధవారం ప్రగతి భవన్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఆలయ ఈవో, ప్రధాన పూజారులు, తదితరులు పాల్గొన్నారు.

కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు కళ్యాణమహోత్సవం ఘనంగా నిర్వహించలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భద్రాచలంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఆసౌకర్యం కలగకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి…

మీరేమంటారు..ప్రజలకు కేటీఆర్ ప్రశ్న?

కరీంనగర్‌..ఏరియల్ వ్యూ చేయనున్న సీఎం

ఆధార్‌ అనుసంధానం పొడగింపు..కేంద్రం

- Advertisement -