ఖండ‌న‌ల్లేవ్.. విడాకులు నిజమేనా?

42
- Advertisement -

మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక పేరు ఇప్పుడు విడాకుల వ్య‌వ‌హారంలో నానుతోంది. మూడేళ్ల క్రితం చైతన్యజొన్నలగడ్డని వివాహం వివాహం చేసుకుంది. కానీ, ఈ జంట ప్రస్తుతం విడాకుల దిశగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని ముమ్మ‌రంగా ప్రచారం జ‌రుగుతూ ఉంది. దీనికి కార‌ణం నిహారిక వ్య‌వ‌హార శైలే అని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. సినిమా లోకంలో పుట్టిపెరిగిన నిహారిక కు, మాజీ ఐజీ జే ప్రభాకర్‌ రావు పెంపకంలో పెరిగిన వెంకట చైతన్య జొన్నలగడ్డకు అసలు పొసగడం లేదట.

ఇదే విడాకుల వ‌ర‌కూ తీసుకు వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. మ‌రి ఈ ప్ర‌చారం ముమ్మ‌రంగానే జ‌రుగుతున్నా… అటు మెగా బ్రదర్‌ నాగబాబు ఫ్యామిలీ నుంచి గానీ, ఇటు మాజీ ఐజీ జే ప్రభాకర్‌ రావు ఫ్యామిలీ నుంచి గానీ ఎలాంటి అప్ డేట్ లేదు. సహజంగా విడాకులు అనే అంశంలో జంట గానీ, వారికీ సంబంధించిన వారు గానీ వెంటనే రియాక్ట్ అయ్యి.. సమాధానం చెబుతారు.

ఇక్కడ మాత్రం ఇరు వ‌ర్గాల నుంచి ఖండ‌న‌లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా ఇది అబద్దం అయితే, ఇలాంటి సంద‌ర్భాల్లో సెల‌బ్రిటీలు వెంట‌నే ఖండ‌న‌లు చేయాలి. అయితే చైతన్య జొన్నలగడ్డ – నిహారిక ల మ‌ధ్య మాత్రం అంతా ముగిసింద‌ని, మ్యూచువ‌ల్ క‌న్సెంట్ తో వీరు విడాకుల బాట ప‌డుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. మరి ఖండ‌న‌ల్లేవ్ కాబట్టి.. విడాకులు నిజమే అనే అనుకోవాలి !!.

ఇవి కూడా చదవండి..

- Advertisement -