బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ సారి ఈ మెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులకు సల్మాన్ కార్యాలయం తెలిపింది. గోల్డీ బ్రార్ అనుచరుడు మోహిత్ గార్గ్ ద్వారా వచ్చినఈ మెయిల్‌లో సల్మాన్‌ను తమ బాస్ గోల్డీ బ్రార్ నేరుగా కలవాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు సల్మాన్‌ను చంపేస్తామనే బెదిరింపు అందులో ఉందని ప్రశాంత్ గుంజాల్కర్ పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది మొదటిసారేం కాదు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ లు పంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిఫ్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్లపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించాడు. అయితే చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. గతేడాది పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత సల్మాన్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ భద్రతను కూడా పెంచింది.
ఇవి కూడా చదవండి..