భారత హై కమిషన్ ఆఫీస్‌పై దాడి..

62
- Advertisement -

లండన్‌లోని భారత్ హై కమిషన్ ఆఫీస్‌పై దాడి జరిగింది. ఖలిస్తానీ మద్దతు దారులు కార్యాలయంపై దాడి చేసి, బిల్డింగ్‌పై ఉన్న త్రివరర్ణ పతకాన్ని తొలగించారు. దీనిపై భారత్ సీరియస్ అయింది. ఈ ఘటనపై ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్​కు మన విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. హై కమిషన్ వద్ద సెక్యూరిటీ కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై అలెక్స్ ఎలిస్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఇండియన్ హై కమిషన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వాటిని తాము ఆమోదించబోమని ట్వీట్ చేశారు.

పంజాబ్​లో వారిస్ పంజాబ్ దే సంస్థ నాయకుడు అమృత్ పాల్ సింగ్ కోసం సెర్చ్ కొనసాగుతుండటం, అతని మద్దతుదారులను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో లండన్​లో పలువురు ఖలిస్తాన్ మద్దతుదారులైన సిక్కులు నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత హైకమిషన్‌ పై దాడి చేసి జెండాను తొలగించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -