నెపోటిజంపై రామ్‌చరణ్ కామెంట్‌..!

19
- Advertisement -

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ ఇండియా టుడే నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ…బంధుప్రీతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో బంధుప్రీతి ఉందంటూ ఎంతోకాలం నుంచి చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే దీన్నిపై ఒక స్టార్ హీరో కుమారిడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ టాలెంట్ లేకపోతే ఇక్కడ నెట్టుకు రావడం కష్టమన్నారు. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ప్రోత్సహిస్తారని చెప్పుకొచ్చారు. నెపోటిజం గురించి నాకు అసలు అర్థం కావడం లేదు. ఇటీవల దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

నాకు నటన అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను పరిశ్రమలోనే ఉన్నాను. సినిమానే ఊపిరిగా తీసుకుంటూ ఎంతోమంది నిర్మాతలను కలుస్తూ వారితో ప్రాజెక్ట్‌లపై చర్చిస్తుంటాను. నా మనసుకు నచ్చిన పని చేయడం వల్లే 14యేళ్లుగా ఇక్కడ నిలబడగలిగాను. మా నాన్న వల్లే పరిశ్రమలోకి వచ్చినప్పటికీ ఈ ప్రయాణానన్ని నాకు నేనుగా ముందుకు సాగించాలి. ప్రతిభ లేకపోతే ఈ ప్రయాణం సులభం కాదని అన్నారు. అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్‌లో నటిస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి…

ఆస్కార్‌ విన్నర్స్‌కి ఘన స్వాగతం..

సలార్ పై క్రేజీ పుకార్లు ఇవే !

అసలు కమల్ హాసన్ కి ఏమైంది?

- Advertisement -