వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్..

11
- Advertisement -

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్ తగిలింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

ఈ కేసులో సీబీఐ చేసే విచారణకు సహకరించాలని సూచించింది. ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తంచేయకుండా సీబీఐ విచారణకు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాశ్ రెడ్డికి స్పష్టంచేసింది.

న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఎంపీ అవినాశ్‌కి షాక్ తగిలింది. వివేకా హత్య కేసులు తనను విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపైనే అవినాశ్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -