తమిళ నటుడు పొన్నంబలం విలన్ గా తెలుగు తెర పై కూడా ఎంతగానో అలరించారు. అయితే, ఆస్తి కోసం అయినవాళ్లే ఆయనను మోసం చేశారు. దాంతో గత కొన్ని ఏళ్లుగా ఆయన ఆర్ధిక ఇబ్బందులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు కిడ్నీ సంబంధిత సమస్యతో ఆయన ఎంతో బాధ పడ్డారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి పొన్నాంబళంకి సాయం చేశారు. పొన్నాంబళం ప్రాణాపాయ స్థితిలో ఉండగా చిరంజీవి ఆదుకున్నారు.
ఈ విషయం పై పొన్నాంబళం మాట్లాడుతూ.. ‘నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక చిరంజీవి గారిని సహాయం అడిగాను. 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకున్నాను. కానీ వెంటనే దగ్గర్లో ఉన్న అపోలోకి వెళ్లి అడ్మిట్ అవ్వమని చెప్పారు. అక్కడ మొత్తం రూ.40 లక్షలయ్యింది. అంతా ఆయనే కట్టారు’ అని పొన్నాంబళం చెప్పారు.
పొన్నాంబళం తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనను ఎవరు మోసం చేశారు లాంటి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పొన్నాంబళం మాటల్లోనే ‘‘నేను మద్యం తాగడం వల్లే నా కిడ్నీలు పాడైపోలేదు. నా తండ్రి మూడో భార్య కుమారుడిని నా సొంత తమ్ముడిగా భావించి మేనేజర్‌గా పెట్టుకున్నా. అతడిని ఎంతో నమ్మాను. ఓసారి నేను తాగే బీర్‌లో అతడు ‘స్లో పాయిజన్’ కలిపాడు. అంతటితో ఆగకుండా విషం కలిపిన ఆహారాన్ని పెట్టేవాడు. డబ్బు కోసం నాపై చేతబడి చేయించాడు. కొంతకాలానికి నా కిడ్నీలు దెబ్బతిన్నాయి. వైద్యుల్ని సంప్రదిస్తే విష ప్రయోగం జరగడం వల్లే ఇలా అయ్యిందని చెప్పారు’’ అంటూ తన తమ్ముడిపై పొన్నంబలం ఆరోపణలు చేశాడు.
ఇవి కూడా చదవండి…