చల్లబడ్డ హైదరాబాద్‌…

46
- Advertisement -

రానున్న మూడు రోజులు తెలంగాణలో వాతావరణ చల్లగా ఏర్పడింది. గురువారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృత్తమైంది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. ఉదయం 9-10మధ్య సూర్యుడు కనిపించినప్పటికీ మళ్లీ మబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్‌ నగరానికి సమీపంలోని వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వానలు పడుతాయని వివరించింది. రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని బుధవారం వెల్లడించింది.

గురువారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.

ఇవి కూడా చదవండి…

పుచ్చ‌కాయ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

కొవ్వును తగ్గించే ఆహార పదార్ధాలు..

పర్వతాసనం వేస్తే ఎన్ని ఉపయోగాలో..!

- Advertisement -