టాలీవుడ్ సినిమా స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్. తాజాగా లాస్‌ఏంజెల్స్‌లో డాల్బీ థియేటర్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని నాటునాటు పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారమైన ఆస్కార్ వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూ ఇస్తూ..సీక్వెల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో సీక్వెల్ గురించి ప్రస్తావన రాలేదని కానీ ఘనవిజయం తర్వాతే సీక్వెల్‌పై చర్చలు జరిపామని అన్నారు. దీన్నిపై ఎన్టీఆర్ రామ్‌చరణ్ రచయిత విజేయంద్రప్రసాద్ కూడా ఎంతో ఉత్సహంగా సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అప్పుడు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది…దాని ఆధారంగా కథ రాయడం ప్రారంభించారు. ప్రస్తుతం మేమంతా సీక్వెల్ పనిలో నిమగ్నమై ఉన్నామన్నారు. ప్రస్తుతం స్క్రీప్ట్ పూర్తయే వరకు మేం సీక్వెల్ విషయంలో ముందుకెళ్లలేం అని అన్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో రచయిత విజేయంద్రప్రసాద్ మాట్లాడుతూ..ఓ రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ గురించిఅడిగాడు. దానికి నేను కొన్ని ఐడియాలు చెప్పా. తనకు రాజమౌళి బాగా నచ్చాయి. దైవానుగ్రహం ఉంటే కొనసాగింపు వస్తుందని తెలిపారు. అంతవరకు సీక్వెల్ కోసం వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాలశివతో ఎన్టీఆర్30 చేస్తున్నారు. రామ్‌చరణ్ తమిళ శంకర్‌తో ఆర్సీ15 చేస్తున్నారు. అయితే రాజమౌళి మహేశ్‌బాబుతో ఓ సినిమాను ప్రకటించారు. దీన్ని కోసం ఓ అమెరికాకు చెందిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇవి కూడా చదవండి…