ఆస్కార్ కి ఎన్టీఆర్ చాలా స్పెషల్ !

23
- Advertisement -

ఆస్కార్ వేడుకల కంటే ముందుగా ప్రీ- ఆస్కార్ పార్టీని ప్రియాంక చోప్రా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ లో ప్రియాంక, ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా డయాస్ దగ్గరకి ఆహ్వానించి ఆ ఫంక్షన్ కి వచ్చిన అతిథులందరికీ పరిచయం చేసింది. ఒక గ్లోబల్ స్టార్ అయిన ప్రియాంక.. తారక్ గురించి గొప్పగా చెబుతూ పరిచయం చేయడం స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. ఇంతేనా ఆస్కార్ వేదిక పై జూనియర్ ఎన్టీఆర్ నే ఎక్కువ హైలైట్ చేశారు ఆస్కార్ నిర్వహకులు.

పైగా టాలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్ల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలిచారు. టైమ్స్ ఆఫ్ ఇండియా మార్చి 1-12 మధ్య చేసిన సర్వే ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాని, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ ఉన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆస్కార్ అవార్డుతో ఎన్టీఆర్ క్రేజ్ డబుల్ అయ్యింది.

అటు రామ్ చరణ్ కూడా తారక్‌.. నీతో మళ్లీ డ్యాన్స్‌ చేసి రికార్డ్స్‌ క్రియేట్‌ చేయాలని ఆశపడుతున్నా అంటూ ట్వీట్ చేశాడు. ఇక ‘నాటు నాటు’ సాంగ్‌కు ఆస్కార్ వరించడం పట్ల ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. భారతీయ చలన చిత్ర చరిత్రలో RRR ఎంతో ప్రత్యేకమైనది. ‘ఆస్కార్‌’ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భారతీయ నటీనటులందరికీ ఈ అవార్డు సొంతం’’ అని తారక్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి…

కంఫోర్ట్‌కే ప్రాధాన్యం…తమన్నా

శాకుంతలం ప్రత్యేకమైనది…సమంత

కాబోయే పాన్ ఇండియా బ్యూటీ ఆమె!

- Advertisement -