2023 ఆస్కార్ అవార్డుల వేదికగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు ఆర్ఆర్ఆర్ సినిమా టీంకి అభినందనలు తెలుపుతున్నారు. మోదీ, సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, కేసీఆర్ వంటి నాయకులు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ రావడం గర్వకారణంగా ఉంది అని తెలిపారు. మొత్తానికి ‘నాటు నాటు…’ పాటకు ఆస్కార్ రావడంతో యావత్ దేశం అంతా సంబరాలు చేసుకుంటోంది.
అయితే ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకునే సమయంలో ఆస్కార్ స్టేజి మీద జూ. ఎన్టీఆర్ ఫోటో మాత్రమే వేయడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘నాటు నాటు…’లో ఇద్దరు హీరోలు అద్భుతంగా డ్యాన్స్ చేశారని, అయినా ఎన్టీఆర్ ను మాత్రమే హైలైట్ చేశారని, ఆస్కార్ కమిటీ చరణ్ ను హీరోగా గుర్తించలేదంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మరోవైపు ఆస్కార్ వేదికపై ఆర్‌ఆర్‌ఆర్‌ను బాలీవుడ్ చిత్రంగా అభివర్ణించాడు హోస్ట్ జిమ్మీ కిమ్మెల్. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. భారత్ లో బాలీవుడ్ ఒక్కటే లేదు. ఎన్నో భాషల ఇండస్ట్రీలు ఉన్నాయి. హోస్ట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆస్కారొచ్చిన వేళ విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి…