బండి సంజయ్ వల్ల బీజేపీ..ఇజ్జత్ మటాష్!

41
- Advertisement -

తెలంగాణలో బీజేపీకి బండి సంజయ్ తలనొప్పిగా మారాడా ? బండి సంజయ్ వల్లే బీజేపీ ఇజ్జత్ మంట కలసిపోతుందా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత పార్టీ బలపడిందా లేదా అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే.. బీజేపీని మాత్రం ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే పలు సందర్భాల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసే వ్యాఖ్యలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని తెలంగాణ ప్రజలు ఈసడించుకునే విధంగా బండి సంజయ్ చేసే వ్యాఖ్యాలే అందుకు కారణం. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

మసీదులను కుల్చాలని, అంతా హిందువులుగా మారాలని ఇలా చాలా సందర్బల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అమిత్ షా పాదాలకు చెప్పులు తొడగడం లాంటి సంఘటనలతో బీజేపీపై అంతో ఇంతో అభిమానం ఉండే ప్రజలు కూడా ఛీ ఛీ అనే పరిస్థితి. ఇక తాజాగా బి‌ఆర్‌ఎస్ నేత ఎమ్మెలి కవితపై అనుచిత వ్యాఖ్యాలు చేసి.. మరోసారి తన వైఖరి ఎలాంటిదో చెప్పకనే చెప్పారు బండి సంజయ్. ఇలా బండి సంజయ్ చేసే వ్యాఖ్యాలు గాని, ఆయన వ్యవహార శైలి గాని.. ప్రజల్లో బీజేపీపై విరక్తి కలిగించేలా చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే బండి సంజయ్ విషయంలో బీజేపీ డైలమాలో పడుతోందట. ఎందుకంటే ఆయనకు ఉండే షార్ట్ టెంపర్ కారణంగా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చెప్పడం కష్టం. ఇదే ఆ పార్టీని చిక్కుల్లోకి నేడుతోంది. వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు పోటీ ఇస్తామని బీజేపీ అధిష్టానం చెబుతున్నప్పటికి.. బండి సంజయ్ కారణంగా పార్టీకి ఉన్న పరువు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని ఆమద్య వార్తలు వినిపించినప్పటికి.. ఈసారి ఎన్నికలకు బండి సంజయ్ నేతృత్వంలోనే వెళ్లాలనేది బీజేపీ అధిష్టానం ప్లాన్. ఏది ఏమైనప్పటికి బండి సంజయ్ వల్ల బీజేపీ గట్టిగానే డ్యామేజ్ జరుగుతోందనేది ఇంటర్నల్ గా నడుస్తున్న టాక్.

ఇవి కూడా చదవండి…

పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. నిజమేనా?

కార్యకర్తలే పార్టీకి బలం: కేటీఆర్

ప్రశ్నించే గొంతులను నొక్కడం సరికాదు…

- Advertisement -