చాలా మంది ఎన్నో అసంఘటిత రంగాల్లో పని చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి రంగాల్లో పని చేసేవారికి ఎలాంటి ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటివి ఉండవు. దాంతో వారి యొక్క పని కాలం ముగింసిన తరువాత ఎలాంటి అదనపు ఉపయోగం ఉండదు. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం 2021లో ఈ- శ్రమ్ అనే పోర్టల్ ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వార 60 సంవత్సరాలు పైబడిన వారికి ప్రతినెల మూడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తారు. అంతే కాకుండా రెండు లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ మరియు లక్ష రూపాయల వరకు ప్రమాద భీమా ఉంటుంది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అంధించే అన్నీ పథకాలు కూడా ఈ- శ్రమ్ కార్డ్ ద్వారా పొందవచ్చు. మరి ఈయొక్క ఈ-శ్రమ్ కార్డ్ కు ఎలా అప్లై చేసుకోవాలి ? ఎవరు అర్హులు ? ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమౌతాయి ? ఈ కార్డు పొందడం వల్ల కలిగే ప్రయోజనలు ఏంటి అనే సమాచారం తెలుసుకుందాం !
అసంఘటిత రంగాల్లో పని చేసే 16 నుంచి 59 ఏళ్ల వయసు గల కార్మికులు ఎవరైనా ఈయొక్క ఈ- శ్రమ్ కార్డ్ కు అప్లై చేసుకునే వీలుంది. ఈ కార్డ్ కు సిఎస్సి ( CSC ) ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోర్టల్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకునే వారియొక్క పేరు, వృత్తి, చిరునామా, విద్యార్హత, నైపుణ్యం వంటి వివరాలు ఇవ్వాలలసి ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ తప్పనిసరి. అలాగే బ్యాంక్ ఖాతా యొక్క డాక్యుమెంట్ కూడా అవసరం అవుతాయి.
ఈ కార్డ్ యొక్క ప్రయోజనలు
ఈ శ్రమ్ కార్డ్ పొందిన కూలీలు దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందవచ్చు. ఇక ఇక కార్డ్ ఉన్నవారికి పైన చెప్పిన ఉపయోగాలతో పాటు.. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన, స్వయం ఉపాధి కోసం జాతీయ పెన్షన్ పథకం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలన్ని వర్తిస్తాయి.
ఇవి కూడా చదవండి..