క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే గాకా ఎక్కడైనా ఏరూపంలోనైనా ఉంటుంది. అలాంటి క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ బాలీవుడ్ నటీ విద్యాబాలన్ స్పందించింది. నేను సినీ కెరీర్ మొదట్లో ఇలాంటిది ఎదుర్కొన్నాను అని తెలిపింది. అదృష్టవశాత్తు క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో నేను చిక్కుకోలేదు అని తెలిపారు. నా తల్లిదండ్రులు భయపడి నన్ను సినిమాల్లో పంపించడానికి అంత ఇష్టపడలేదు అని విద్యాబాలన్ తెలిపింది.
ఓ యాడ్ షూట్ కోసం చెన్నైకు వెళ్లినప్పుడు ఓ దర్శకుడు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. సినిమా గురించి చర్చించడానికి మేమిద్దరం కాఫీకి వెళ్లాం. కథ గురించి మాట్లాడుతున్న సమయంలో మిగతా విషయాలు మనం రూమ్‌కు వెళ్లి మాట్లాడుకుందాం అని అన్నారు. ఒక్క దానినే ఉండటం వల్ల భయపడుతూనే రూమ్‌కి వెళ్లాను అక్కడికి వెళ్లిన వెంటనే తెలివిగా వ్యవహరించి గది తలుపులు తెరిచే పెట్టాను. దీంతో అతడికి ఏం చేయాలో పాలుపోక అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు. ఆక్షణం అలా చేయమని నాకు ఎవరూ చెప్పలేదు. కానీ నేను క్యాస్టింగ్ కౌచ్ నుంచి తృటిలో తప్పించుకున్నాను అని వివరించింది.
బాలీవుడ్‌లో కథాప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటునే ముందుకు సాగుతున్న విద్యాబాలన్…డర్టీ పిక్చర్‌తో మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులోనూ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో అలరించి తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యారు.
ఇవి కూడా చదవండి…