ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష..

39
kavitha
- Advertisement -

నేడు జంతర్ మంతర్ లో ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష చేపట్టనున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిరసన దీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీక్షలో ఎమ్మెల్సీ కవితతో పాటు సుమారు 500మంది కూర్చోనున్నారు.

దీక్షకు 18 పార్టీ ప్రతినిధులు సంఘీభావం తెలపనున్నారు. బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆకలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సిపిఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుండి ప్రతినిధులు హాజరుకానున్నారు.

అలాగే మహిళహక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు హాజరుకానున్నారు. దీక్షను ప్రారంభించనున్నారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. దీక్ష ముగింపునకు హాజరుకానున్నారు సీపీఐ కార్యదర్శి డి. రాజా.

ఇవి కూడా చదవండి..

- Advertisement -