విచారణను ఎదర్కొంటా..కవిత

36
- Advertisement -

మోదీ వన్ నేషన్ వన్ ఫ్రెండ్ స్కీమ్‌ను అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఢిల్లీలో నిర్వహించే ఒక రోజు నిరహార దీక్షకు వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత…ఈడీ విచారణకు వందశాతం సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియతో మాట్లాడుతూ…తాను ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి విచారణ ఎదుర్కొంటానని అన్నారు. కానీ ఎమ్మెల్యేల ఎర కేసుల్లో మాత్రము బీఎల్‌ సంతోష్‌ ఎందుకు సిట్‌ ముందుకు రాలేకపోతున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నించిన విపక్ష నేతలకు దర్యాప్తు సంస్థలతో దాడులు కేసులు తప్పవని కానీ బీజేపీలో ఉన్న నాయకులకు ఇలాంటివి వర్తించవని అన్నారు. తమ వైపు సత్యం ధర్మం న్యాయం ఉందని ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటామని అని కవిత అన్నారు.

తెలంగాణలో నవంబర్ డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు రావొచ్చు. కానీ అంతలోనే తెలంగాణ నేతలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమని అన్నారు. మహిళ బిల్లు ఆందోళన అనగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలపై కేంద్రం లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఈడీ సీబీఐ ఐటీ బెదరింపులకు పాల్పడుతోందని అన్నారు.

ఇవి కూడా చదవండి…

మోదీ, ఈడీ సమన్లకు భయపడం…

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నామినేష‌న్లు

ఎమ్మెల్సీ కవిత దీక్షకు విపక్ష నేతలు

- Advertisement -