వణికిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్..

15
- Advertisement -

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్‌3ఎన్‌2 వైరస్‌తో జ్వరం,దగ్గు కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ సాధారణంగా ఏటా ఈ సమయంలో మార్పులకు లోనవుతుందని చెప్పారు.

ఈ వైరస్‌ కొవిడ్‌లా వ్యాపిస్తోందని అని అంతా జాగ్రత్తగా ఉండలని చెప్పారు. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే జనం సులభంగా ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, ముక్క కారడం వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -