టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు ..

210
TRS plenary in 600 acres..
TRS plenary in 600 acres..
- Advertisement -

ప్లీనరీ ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ మంత్రి, ప్లీనరీ ఇన్‌చార్జ్‌ కేటీఆర్‌, నాయకులను ఆదేశించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌ కొంపల్లిలోని జీబీఆర్‌ గార్డెన్స్‌లోని ప్లీనరీ సమావేశాల సభాస్ధలాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను, పార్కింగ్‌ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను కేటీఆర్‌ స్వయంగా పరిశీలించారు. ఆయన ఏర్పాట్లపై స్ధానిక ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. అభివృద్ధికి తగ్గట్టుగా.. ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. 8 వేల నుంచి 10 వేల మంది సభకు హాజరవుతారన్నారు. ఏప్రిల్ 21న ఉదయం 10 గంటలకు ప్లీనరీ మొదలవుతుందని..ముందుగా కేసీఆర్ పార్టీ జెండా ఆవిష్కరణతో ప్రారంభిస్తారన్నారు.

kcr

31 జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయన్నారు. ఆరు భోజన శాలలు ఏర్పాటు చేశామన్నారు. వీఐపీలు, మంత్రులు, ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలకు, మీడియా మిత్రులకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాట్లు ఉంటాయన్నారు.

మొత్తం 60 ఎకరాల్లో ప్లీనరీ సభను ఏర్పాటు చేశామన్నారు. 35 ఎకరాల్లో ఏ, బీ, సీ లలో పార్కింగ్ సౌకర్యం ఉందన్నారు. జిల్లాల నుంచి సభా ప్రాంగణానికి వాహనాలలో వచ్చే వాళ్లు అవుటర్ రింగ్ రోడ్డు వెంబడి రావాలన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.

trs2

కాగా, ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 31 జిల్లాల ప్రతినిధులకు దారిచూపేందుకు రెండువేలకుపైగా సైన్ బోర్డులు నెలకొల్పుతున్నారు. ఎండ వేడి నుంచి తట్టుకునేలా సభా ప్రాంగణంలో మొత్తం 200 డిజిటల్ ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం వెయ్యి మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. ఇక పురుషుల కోసం 40 కెమికల్ టాయ్‌లెట్లు, మహిళల కోసం 20 కెమికల్ టాయ్‌లెట్లు నెలకొల్పుతున్నారు. 50 సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేశారు. వేదికను, సభాప్రాంగణాన్ని, పార్కింగ్ ఏరియాను పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. సీఎం సెక్యూరిటీ విభాగం కూడా ప్లీనరీ వేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.

- Advertisement -