ఖరీదైన వైద్యం పేదలకందాలి..హరీశ్‌

44
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రభుత్వ పిల్లలాసుపత్రిలో ఒకే రోజు 9మంది చిన్నారులకు హార్ట్‌ సర్జరీలు పూర్తిచేసింది. ఇంగ్లాండ్ వైద్యబృందంతో కలిసి ఈ ఫీట్‌ సాధించింది. ఈ సందర్భంగా బ్రిటన్ వైద్యబృందంకు మంత్రి హరీష్‌రావు సన్మానం చేశారు. నిమ్స్ ఆస్ప‌త్రిలో యూకే వైద్యుల‌కు నిర్వ‌హించిన స‌న్మాన కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. పసి హృదయాల‌ను కాపాడేందుకు, త‌మ‌ ఆహ్వానం మేరకు నిమ్స్ ఆస్ప‌త్రికి వచ్చిన బ్రిటన్ వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

డాక్టర్ వెంకట రమణ దన్నపనేని తమ బృందంతో వచ్చి నిలోఫర్ నిమ్స్ వైద్యులకు సహకారం అందించారు. ఎక్మో మీద ఉన్న చిన్నారికి కూడా సర్జరీ చేయడం గొప్ప విషయమన్నారు. ఒక్కో సర్జరీలో 20మందితో కూడిన వైద్య బృందం 4-5గంటల పాటు శ్రమించి సక్సెస్‌చేశారని అన్నారు. విదేశి నిపుణులను తీసుకొచ్చి ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేసిన సందర్భం ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్‌లోనే జరిగిందని హరీశ్‌రావు గుర్తు చేశారు.

చిన్న పిల్లలకు గుండె సర్జరీలు అంటే అత్యంత క్లిష్టమైనదని ఖరీదైన వైద్యమని అన్నారు. దీన్నికోసం ప్రైవేటులో లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ నిమ్స్‌లో పూర్తిగా ఉచితంగా సర్జరీలు చేయడం జరిగిందన్నారు. తనకు ఈ రోజు ఎంతో సంతోషంగా అనిపించింది. సర్జరీ తర్వాత పిల్లలు నవ్వుతుంటే మనసు నిండిపోయిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

తెలంగాణలో పుట్టే ప్రతి 6లక్షల చిన్నారుల్లో దాదాపుగా పూర్తిగా 1000మందికి గుండెకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తే తప్పనిసరి అన్నారు. కార్పొరేట్‌కి వెళ్లలేక సరైన సమయంలో వైద్యం అందక కొందరు చిన్నారులను కోల్పోతున్నామన్నారు. అందుకే పిల్లల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

స్పుత్నిక్‌-వీ సృష్టికర్త హత్య..!

ఉమెన్స్ డే..గ్రీన్ పోస్టర్ ఆవిష్కరించిన వాకాటి కరుణ

పాదయాత్రల లొల్లి.. కాంగ్రెస్ బలి !

- Advertisement -