ఉమెన్స్ డే..గ్రీన్ పోస్టర్ ఆవిష్కరించిన డీసీపీ శిల్పవళ్లి

13
- Advertisement -

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మార్చి8వ తేదీన మొక్కలు నాటాలని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర పోలీస్‌ విభాగం నుంచి డీసీపీ శిల్పవళ్లి ఉమెన్స్‌ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే ప్రకృతి పరవశించిపోతుందన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ జాగ్రత్త అద్భుతమని…ప్రేమతో మహిళ లోకం అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా డీసీపీ శిల్పవళ్లి మాట్లాడుతూ…సృష్టికి మూలం స్త్రీమూర్తి అని…మహిళలంతా ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున తోటి అధికారులు అంతా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి…

ఉమెన్స్ డే..గ్రీన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన శ్వేతా

టీవర్క్స్ ప్రారంభించిన లియూ, కేటీఆర్‌

ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత

- Advertisement -