సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ TJ జ్ఞానవేల్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. సూర్య తో జ్ఞానవేల్ తీసిన జై భీమ్ మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా అతనికి అవార్డుతో పాటు మంచి గుర్తింపు దక్కింది.
ఈ సినిమా చూసి పిలిచి మరీ రజినీ కాంత్ ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమాను తాజాగా ప్రొడక్షన్ నుండి ఎనౌన్స్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్న ఈ సినిమాలో రజినీ ఓ ముస్లిం పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాతో 170 వ సినిమా మైలు రాయిని చేరుకోనున్నాడు సూపర్ స్టార్.
రజినీ తాజాగా దర్బార్ లో పోలీస్ గా కనిపించాడు. కానీ గెటప్ అదే అయిన ఈసారి సరికొత్త పాత్రతో మెప్పించనున్నాడు. ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో ? జ్ఞానవేల్ రజినీతో ఎలాంటి కథ తీయబోతున్నాడో చూడాలి.
ఇవి కూడా చదవండి…