కరోనా వచ్చిన తర్వాత నుంచి కార్డియాక్ అరెస్టు విపరీతంగా పెరిగినట్టుగా పలు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ బాలరాజు అనే వ్యక్తికి సీపీఆర్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కార్డియాక్ అరెస్టు కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ జిల్లాలో సీపీఆర్ శిక్షణను ప్రారంభించారు రాష్ట్ర వైద్యాశాఖ మంత్రి హరీశ్‌రావు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కార్డియాక్ అరెస్టు ఎవరికైనా రావొచ్చు…అది రావడానికి సమయం సందర్భం లేదు అని అన్నారు. ఒక వ్యక్తి కార్డియాక్ అరెస్టుకు గురైన ఆ కొద్ది నిమిషాల్లో సదరు వ్యక్తిని సీపీఆర్ చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను బతికించుకోవచ్చన్నారు. తెలంగాణలో సడెన్ కార్డియాక్ అరెస్టు వల్ల ఏడాదికి 24వేల మంది చనిపోతునన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సీపీఆర్ శిక్షణ బాగా చేయగలిగితే ఇందులో సగం మందిని కాపాడుకోవచ్చన్నారు. వైద్యారోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం అని తెలిపారు.
గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉండే సెక్యూరిటీతో పాటు ఇతరులకు కూడా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రజల యొక్క విలువైన ప్రాణాలను కాపాడటమే సీపీఆర్ లక్ష్యం. సీపీఆర్ శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ మారిపోయిందన్నారు. ప్రతి రోజు వ్యాయామం, యోగా చేయాలని సూచించారు. ఆహారపు అలవాట్లు మారాయని దీంతోప పాటుగా పని ఒత్తిడి కారణంగా కార్డియాక్ అరెస్టులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్య రక్షణ కోసం లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలన్నారు. సీపీఆర్‌ను మున్సిపాలిటీలు గ్రామ పంచాయితీల వరకు తీసుకెళ్లేందుకు వైద్యారోగ్య శాఖ కృషి చేస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి…