దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జీ20 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరుగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ జీ20 దేశాల విదేశాంగ మంత్రులు రెండు రోజుల పాటు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బీర్‌బాక్, బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్‌తో పాటు పలు ఐరోపా దేశాల విదేశాంగ మంత్రులు హాజరుకానున్నది
మరో వైపు జీ20 సమావేశాలకు జపాన్ విదేశాంగ మంత్రి హాజరుకావడం లేదు. దేశీయ పార్లమెంటరీ సమావేశాల కారణంగా సమావేశానికి హాజరు కావడం లేదని మంత్రి హయాషి తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి 2019 తర్వాత తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు. 2020 మేలో తూర్పు లడఖ్‌లో ఘర్షణ అనంతరం.. నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించనున్నారు.
ఇవి కూడా చదవండి..