1. పుదీనా ఆకుల్లో వ్యాధి నిరోధక శక్తి ని పెంచే విటమిన్ “ఎ” విటమిన్ “సి” గుణాలు అధికంగా ఉంటాయి .
2. పుదీనా ఆకుల టీ తాగితే కంఠస్వరం బాగుంటుంది. గాయకులు ,డబ్బింగ్ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మధురంగా తయారవుతుంది.
3. కడుపు నొప్పితో బాధపడుతున్నవారు మరగించిన పాలలో పుదీనా ఆకులను వేసి కాస్త పంచదార కలిపి తాగితే ఫలితం లభిస్తుంది.
4. పుదీనా ఆకులు నమిలితే పళ్లు ,చిగుళ్లు గట్టి పడుతాయి, చిగుళ్లుకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి.
5. చిన్న పిల్లలు కు గోరు వెచ్చని నీటిలో 6 చుక్కల పుదీనా రసం కలిపి తాగించడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. పోడి దగ్గు వస్తున్నప్పుడు గొంతులో గర గర వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.
7. మెటిమలు,మచ్చల పై పుదీనా రసాన్ని రాస్తే త్వరగా తగ్గుతాయి.పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలను పోగొడతాయి.
8. ఎండకాలంలో వడదెబ్బతగలకుండా ఉండాలంటే , మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తీసకోవాలి.
9. పుదీనా ఆకుల రసాన్ని రోజూ రెండు స్పూన్లు తేనెలో కలిపి పిల్లలకు తాగిస్తే కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోతాయి.
10. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు తరచూ పుదీనా తింటే నొప్పుల నుండి ఉపశమనం పోందవచ్చు.
11. వారానికి మూడు సార్లు పుదీనా ఆకులను ఆహారంలో చేర్చుకుంటే అలెర్జీని దూరం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..