ఫిబ్రవరి బాక్సాఫీస్ రివ్యూ

18
- Advertisement -

సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘ వీర సింహా రెడ్డి’ సినిమాలు యాభై రోజులు పూర్తి చేసుకున్నాయి. ఆ నెలలో వచ్చినవన్నీ దాదాపు ఓటిటిలో స్ట్రీమింగ్ అయిపోయాయి. ఫిబ్రవరి మాసం కూడా పూర్తయ్యింది. నిజానికి అన్నీ ప్లానింగ్ ప్రకారం జరిగి ఉంటే శివరాత్రి పండక్కు ఏజెంట్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ రేస్ లో ఉండేది. కానీ నిర్మాణంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ లో జరిగిన ఆలస్యం వల్ల ఏప్రిల్ కి వాయిదా పడింది. బడా స్టార్ హీరోలెవరూ ఈ డ్రై మంత్ ని వాడుకునే సాహసం చేయలేదు.

ఓవరాల్ రివ్యూ విషయానికి వస్తే యునానిమస్ గా ఫిబ్రవరి విన్నర్ గా ధనుష్ సార్ నిలబడింది. బ్రేక్ ఈవెన్ కి మూడు రెట్లు రాబడి సాధించిన బ్లాక్ బస్టర్ గా ఇప్పటికీ స్టడీ రన్ కొనసాగిస్తోంది. బైలింగ్వల్ గా రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఒకవేళ మాస్ ని కూడా అంతే స్థాయిలో మెప్పించి ఉంటే ఫిగర్లు వేరే లెవెల్ లో ఉండేవి. రెండో విజేత రైటర్ పద్మభూషణ్. సుహాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా సైతం భావోద్వేగాల మీద నడిచిందే. ఓటిటిలో వర్కౌట్ అయ్యే ఇలాంటి కంటెంట్ తో థియేటర్ గ్రాస్ పది కోట్లు దాటించడమంటే పెద్ద విజయమే

వినరో భాగ్యము విష్ణుకథ టీమ్ చెప్పుకున్న స్థాయిలో కాకపోయినా డీసెంట్ రెవిన్యూతో గట్టెక్కిపోయింది. భారీ స్థాయిలో జనాన్ని ఆకట్టుకోలేదన్నది వాస్తవం. ఇక గట్టి అంచనాలు మోసుకున్న సందీప్ కిషన్ మైఖేల్, సితార బ్యానర్ నుంచి వచ్చిన బుట్టబొమ్మ రెండో రోజే టపా కట్టేసేంత వీక్ గా బోల్తా కొట్టాయి. కళ్యాణ్ రామ్ అమిగోస్ యావరేజ్ కూడా అనిపించుకోలేకపోయింది. అయితే ఫిబ్రవరి చివరి వారం మాత్రం అత్యంత నీరసంగా నడించింది. కొత్త సినిమాలేవి కనీసం మొదటి ఆటకు హాలు నిండేంత జనాన్ని రప్పించలేకపోయాయి. మరి ఉగాది పండగొచ్చే మార్చ్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

నాకు ఓకే కాదుగా…మృణాల్‌

పిక్ టాక్ : కియారా ఓ అందాల మయం!

శ్రియా పనైపోలేదు.. మళ్లీ మొదలైంది

- Advertisement -