ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్‌..

81
- Advertisement -

అపర కుబేరుడు, టెస్లా,ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్‌ వన్‌గా నిలిచారు. టెస్లా షేర్లు రాణించడంతో ఆయన మళ్లీ తొలి స్ధానానికి చేరుకున్నారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.

గత ఏడాది డిసెంబరులో ఎలాన్‌ మస్క్‌ సంపద 200 బలియన్‌ డాలర్ల మేర కరిగిపోయింది. టెస్లా షేర్లు పతనమవడంతో ఆయన తన తొలిస్థానాన్ని కోల్పోయారు. ఇక ప్రస్తుతం టెస్లా షేర్లు బలంగా పుంజుకోవడంతో తొలిస్థానాన్ని కోల్పోయిన రెండు నెలల్లోనే మళ్లీ తన స్థానాన్ని సొంతం చేసుకున్నారు మస్క్‌.

ఈ ఏడాది మొదట్లో 137 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ సంపద.. ఇప్పుడు ఏకంగా 187 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. మస్క్ తర్వాత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 185 బిలియన్‌ డాలర్ల సంపదతో రెండో స్థానంలో,అమెజాన్​బాస్​ జెఫ్​ బెజోజ్ మూడో స్థానంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -