ప్రొఫెషనల్ కెరీర్‌లో దుబాయ్ వేదికగా చివరి మ్యాచ్ ఆడి టెన్నిస్‌కు గుడ్ బై చెప్పిన సానియా మరోసారి రాకెట్ పట్టనుంది. అది అభిమానుల కోసం. సానియా సన్నిహితులు, కుటుంబ సభ్యులు,అభిమానుల సమక్షంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో టెన్నిస్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పనుంది సానియా. మార్చి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రెండు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో సానియా బరిలోకి దిగనుంది.
ఈ మ్యాచ్ లలో సానియాతో పాటు గతంలో ఆమెతో కలిసి ఆడిన ఇవాన్ డోడిగ్, రోహన్ బోపన్న, కారా బ్లాక్, బెతానీ మాటెక్, మరియన్ బర్తోలి బరిలోకి దిగి అభిమానులను అలరించనున్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో సానియా మీర్జా రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. మొదటిది సానియా – బోపన్న, ఇవాన్ డోడిగ్ – బెథానీ మాటెక్ – సాండ్స్ మధ్య మిక్స్ డ్ డబుల్స్ మ్యాచ్, రెండోది సానియా – బోపన్న, మరొకటి రోహన్ బోపన్న నేతృత్వలోని రెండు జట్ల మధ్య రౌండర్ల మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్ లను వీక్షించే అభిమానులు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ధర కనిష్టం రూ. 499, గరిష్టం రూ. 799 నిర్ణయించారు. పేటీఎంలో మ్యాచ్ టికెట్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు.
ఇవి కూడా చదవండి..