మనం తినే ఆహారం ఏ మాత్రం తేడాకొట్టిన కడుపులో గందరగోళం మొదలౌతుంది. దాంతో వాంతులు, విరోచనలు మొదలై శరీరం నీరసంగా తయారవుతుంది. కొన్నిసార్లు తీసుకున్న ఆహారం వల్ల మాత్రమే కాకుండా విరోచనాల బారిన పడుతుంటారు. రోజుకు రెండు సార్లు లేదా మూడు సార్లు మల విసర్జన చేయడం సాధారణం.. అయితే అంతకంటే ఎక్కువసార్లు మల విసర్జన చేయాల్సి వస్తే దానినే విరోచనలు అంటారు. ఈ విరోచనలలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి నీళ్ళ విరోచనలు దీనినే డయేరియా అంటారు. రెండవది రక్తం, బంక ( జిగురు )తో వచ్చే విరోచనలు దీనినే డిసెంట్రీ అంటారు. డయేరియా లేదా నీళ్ళ విరోచనలు అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అన్నీ వయసులో వారికి వచ్చే సాధారణ వ్యాధి. ముఖ్యంగా మనం తినే ఆహారం జీర్ణాశయంలో సరిగా జీర్ణం కాకపోయినప్పుడు నీళ్ళ విరోచనల బారిన పడే అవకాశం ఉంది. అయితే ఎవరికైనా విరోచనలు వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవడం లేదా వైద్యుడిని సంప్రదించి మెడిసన్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే విరోచనలకు మన ఇంటి చిట్కాలు కూడా చక్కగా పని చేస్తాయి.
* ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరా టీ స్పూన్ దాల్చిన చెక్కపొడి మరియు రెండు టీ స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే విరోచనలు తగ్గుతాయి.
* దాల్చిన చెక్క మరియు అల్లం అరగంట పాటు నీటిలో బాగా ఉడికించి ఆ నీటిని తాగితే విరోచనలు వెంటనే తగ్గుముఖం పడతాయి.
* విరోచనలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడూ రోజుకు 4 లేదా 5 కప్పుల గడ్డ పెరుగు మరియు బాగా మగ్గిన అరటిపండు మరియు దాల్చిన చెక్కతో కలిపి తీసుకుంటే విరోచనల నుంచి విముక్తి కలుగుతుంది.
* గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని తాగితే కూడా విరోచనలు తగ్గుతాయి.
* గుమ్మడి గింజలు మరియు ఆకుల యొక్క రసం కూడా విరోచనలకు ఔశదంలా పని చేస్తుంది.
* విరోచనల బారిన పడినప్పుడు కొత్తిమీర ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. కొత్తిమీర మనం తినే ఆహారాన్ని వెంటనే జీర్ణం చేసి అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది.
ఇవి కూడా చదవండి:సీఎం రేవంత్‌కు హరీశ్ రావు విషెస్