భారత ఐటీ రంగానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాకిచ్చారు. విదేశీయులు తమ దేశంలో పనిచేసేందుకు గాను జారీ చేసే వీసా నిబంధనల్లో అమెరికా పలు మార్పు లు చేసింది. ఆ మార్పులకు ఆమోదముద్ర వేస్తూ అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో భారత ఐటీ రంగంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. వీసా నిబంధనల్లో మార్పులు తీసుకు రావడం వల్ల అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులు మాత్రమే తమ దేశానికి వస్తారని అమెరికా అభిప్రాయపడు తోంది.
ఈ నిబంధనలపై సంతకం చేయ డంతో ”ఫస్ట్ అమెరికా’ అనే ట్రంప్ ఎన్నికల నినాదానికి తొలి వంద రోజుల్లోనే ప్రాధాన్యతనిచ్చి అమలు చేసినట్లైంది. అంతేకాక దేశ ఆర్థిక వ్యవస్ధకు బలం చేకూర్చేందుకు ఫెడరల్ కాంట్రాక్టులు కూడా అమెరికా సంస్ధలకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. కార్మిక, న్యాయ, దేశీయ భద్రతా విభాగా లను అప్రమత్తం చేసి అమెరికాలో ఉద్యోగాల కోసం వచ్చే విదేశీయులపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
శాస్త్రవేత్తలు.. ఇంజినీర్లు.. కంప్యూటర్ ప్రోగ్రామర్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. 65 వేల వీసాలు జారీ చేయడానికి ప్రభుత్వం లాటరీ విధానాన్ని ఎన్నుకుంది. మరో 20వేల వీసాలను గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వర్కర్లకు కేటాయిస్తారు. ట్రంప్ నిర్ణయంతో ఈ ఏడాది హెచ్1బీ వీసాలకు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గత ఏడాది 2,36,000 ఉండగా.. ఈ సారి 1,99,000లకు మాత్రమే పరిమితమైంది. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వారిని నియమించుకోవడానికే హెచ్1బీ వీసాలను వినియోగిస్తామని కంపెనీలు చెబుతున్నాయి.
భారత ఐటీ కంపెనీలను దెబ్బతీయడంలో అమెరికా సరసన ఆస్ట్రేలియా చేరింది. ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసే విదేశీయులకు జారీ చేసే ‘వీసా 457’ను రద్దు చేస్తున్నట్లు ప్రధాని టర్న్‌బుల్ ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం జారీచేసే ఈ వీసాలను అత్యధికంగా భారతీయులే ఉపయో గిస్తారు. ఆస్ట్రేలియాలో పనిచేయాలనుకున్న భారత్ ఉద్యోగు లకు ఇది పెద్ద ఎదురు దెబ్బ. దాదాపు 95 వేల వీసాలపై టర్న్‌బుల్ నిర్ణయం ప్రభావం పడనుంది. దేశంలో పెరిగి పోతున్న నిరుద్యోగాన్ని అదుపు చేసేందుకు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.