ఐటీకి కేరాఫ్ తెలంగాణ..

51
- Advertisement -

ఐటీ పరిశ్రమకు కేరాఫ్‌గా తెలంగాణ మారిందన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వెల్స్పన్ పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకాకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డిజిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఐటీ విస్తరించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్స్పన్ నిర్ణయం బలోపేతం చేస్తుందన్నారు.

ఇక్కడి స్థానిక యువకులకు సైతం ఐటీ ఉద్యోగాలు చేసుకునేందుకు ఈ సెంటర్ లో అవకాశం లభిస్తుందని చెప్పారు. దాదాపు 1,200 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వెల్స్పన్ కంపెనీ రాకముందు చందన్వెల్లి, సీతారాంపూర్ లాంటి ప్రాంతాల్లో మచ్చుకు ఒక్క పరిశ్రమ అయినా కనిపించేది కాదని అన్నారు. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల్లో అనేక కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి కంపెనీలను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయని మంత్రి అన్నారు. ఇప్పుడు ఈ ఐటీ కేంద్రం ఏర్పాటుతో మరిన్ని చిన్న మధ్య తరహా కంపెనీలు ఈ ప్రాంతపైపు దృష్టి సారిస్తాయన్న అశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -