100 మంది మోడీలు వచ్చినా ఆపలేరు!

22
- Advertisement -

కాంగ్రెస్ గెలుపును 100 మంది మోడీలు వచ్చిన ఆపలేరన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. రాబోయే సార్వత్రి ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ ఒంటరి పోరు చేయడం లేదని, ఇందుకోసం భావసారూప్యత కలిగిన పార్టీన్నింటిని కలుపుకుపోయే ప్రయత్నంలో ఉందని ఆయన స్పష్టం చేశారు.

విపక్ష కూటమికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని నేనే, ఇతర వ్యక్తులెవరూ నన్ను తాకలేరని ప్రధానమంత్రి మోదీ పదేపదే ఓమాట చెబుతున్నారు. ప్రజాస్వామ్యవాది ఎవరైనా అలా చెప్పుకుంటారా? మోడీజీ అని ప్రశ్నించారు.

స్వతంత్ర్యం కోసం దేశ ప్రజలు ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ వాళ్లు అనేక త్యాగాలు చేశారు. బీజేపీ అసలేమీ చేయలేదు. స్వాతంత్ర్యం కోసం బీజేపీ నుంచి ఒక్కరైనా ఉరికంబం ఎక్కారా? అని ప్రశ్నించారు. కనీసం స్వాతంత్ర్య పోరాటంలో పాలు పంచుకున్నారా? జైళ్లకు వెళ్లారా? దీనికి బదులు వాళ్లేం చేశారు? జాతి పిత మహాత్మాగాంధీని పొట్టనపెట్టుకున్నారు అని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -