త్రివిక్రమ్ మార్పులతో పవన్ రీమేక్!

25
- Advertisement -

పవన్ కళ్యాణ్ , సాయి ధరం తేజ్ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా తెరకెక్కుతున్న ‘వినోదాయ సీతమ్’ రీమేక్ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఓ ఆఫీస్ లో పవన్ , తేజ్ లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఓ వారం రోజుల పాటు ఇద్దరిపై సన్నివేశాలు తీసి యూనిట్ తర్వాత బ్రేక్ తీసుకొనున్నారు. ఆ తర్వాత సాయి ధరం తేజ్ పై ఓ సాంగ్ ఘాట్ చేస్తారు. ఆ సాంగ్ కంప్లీట్ తర్వాత మళ్ళీ పవన్ ఘాట్ లో జాయిన్ అవుతాడు.

ఈ రీమేక్ కి సంబంధించి త్రివిక్రమ్ చాలానే మార్పులు చేశారు. ముఖ్యంగా ఒరిజినల్ లో సముద్రఖని పాత్ర గెస్ట్ రోల్ లా ఉంటుంది. తెలుగులో పవన్ కోసం ఆ పాత్ర నిడివి పెంచి కొన్ని సన్నివేశాలు యాడ్ చేశారు. పవన్ కి తగ్గట్టుగా కేరెక్టర్ లో మార్పులు చేశాడు త్రివిక్రమ్. అలాగే ఒరిజినల్ లో ఓ మధ్య వయసు గల కుటుంబ పెద్ద పాత్రను తేజ్ కి తగ్గట్టుగా , కుటుంబం భాద్యతలు తనపై పడిన ఓ చలాకీ కుర్రాడిగా మార్చారు.

అలాగే తేజ్ కోసం ఓ సాంగ్ క్రియేట్ చేశారు. ఇలా త్రివిక్రమ్ ఈ రీమేక్ స్క్రిప్ట్ ను చాలా మార్పులు చేశారు. ఓ రైటింగ్ టీంను పెట్టుకొని చాలా వర్క్ చేశారు. మహేష్ సినిమా చేస్తూనే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తూ వచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా కోసం 20 నుండి 30 రోజుల మధ్య పవన్ డేట్స్ ఇచ్చాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఘాట్ లో పవన్ కనిపించేది 22 రోజులే. ఆ తర్వాత హరిహరవీరమల్లు ఘాట్ మొదలు పెట్టాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -