- Advertisement -
తమిళ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నైలోని కొడంబక్కంలోని మెడ్వే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్లు.
ప్రభుకి కిడ్నిలో రాళ్లు ఉండగా.. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రభు ఆర్యోగం నిలకడగా ఉందని, ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలుగులో చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాల్లో నటించి తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఇటీవలే దళపతి విజయ్ నటించిన వారసుడు చిత్రంలో కనిపించారు ప్రభు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -