సమంతా.. ఏంటీ కొత్త స్పీచ్‌..?

559
Samantha Post her Sad Face in Social Media
- Advertisement -

సిల్వర్‌ స్క్రీన్‌ లో సమంత ఎంత ఆక్టివ్‌ గా ఉంటుందో, అంత కంటే ఆక్టివ్‌గా సోషల్‌ మీడియాలోనూ ఉంటుంది. తనకి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడంలో సమంతకి ఎలాంటి మొహమాటం ఉండదు. ఏవిషయాన్నైనా ఫ్యాన్స్‌ తో పంచుకోవడ సమంతకి అవవాటే. అయితే ఈ చెన్నై చిన్నది సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు రిప్లే కూడా ఇస్తుంది. దీంతో సామ్‌ కి సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగానే పెరిగిపోయింది.
Samantha Post her Sad Face in Social Media
అయితే తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫోటోని పోస్ట్ చేసింది సమంత. ఆ ఫోటోతో పాటు “ఆడదాని కళ్లలోకి చూసి మనసులో ఏముందో తెలుసుకోగలగడమే నిజమైన అందం” అంటూ కామెంట్ పెట్టేసింది. దీంతో ఫ్యాన్స్‌ అందరిర్లోనూ..అనేక సందేహాలను మొదలయ్యాయి.
Samantha Post her Sad Face in Social Media
వేదన నిండిన మనసుతో తాను కన్నీళ్లు పెట్టుకున్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సమంతా పోస్ట్ చేసి ఇలాంటి స్పీచ్‌ ఇవ్వడమేంటి..? అసలు సమంతకి అంతగా బాధ కలిగించే సంఘటన ఏం జరిగింది.? అనే డౌట్‌లో ఉన్నారు ఫాలోవర్స్. అయితే ఈ ఫొటో ప్రస్తుతం సమంత చేస్తోన్న ఓ సినిమాలోనిదని అంటున్నారు. అది తెలుగు సినిమాలోనిదా..లేక తమిళ సినిమాలకి చెందినదా అనే అయోమయంలో కూడా ఉన్నారు ఫ్యాన్స్‌. ఏదేమైనా.. సమంత నోరు విప్పితేగానీ అసలు నిజం బయటపడదనే చెప్పాలి.

- Advertisement -