రెమ్యునరేషన్‌లో రజనీ కొత్త రికార్డు!

23
- Advertisement -

జీవితం పట్ల స్పష్టమైన దృక్పథంతో ఉంటారు సూపర్ స్టార్ రజినీకాంత్. తన సుదీర్ఘ సినీ కెరీర్ లో అపజయాలకు ఏ మాత్రం బెదరకుండా.. ప్రతి విషయంలో సానుకూలంగా ఆలోచించడం ఒక్క రజినీకాంత్ కి మాత్రమే చెల్లింది. తాజాగా రజినీకాంత్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఒక సినిమా కోసం సూపర్ స్టార్ తన కెరీర్ లోనే రికార్డు స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు కన్నడ నుంచి శివరాజ్ కుమార్, తమిళం నుంచి శివ కార్తికేయన్, మలయాళం నుంచి మోహన్ లాల్, తెలుగు నుంచి సునీల్, హిందీ నుంచి జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. కేవలం ఒకే రాత్రిలో జరిగే కొన్ని నాటకీయ సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రజినీకాంత్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా ?,

సూపర్ స్టార్ దాదాపు 85 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు అని తెలుస్తోంది. పైగా ఈ సినిమాకి రజిని ఇచ్చిన డేట్స్ కూడా చాలా తక్కవ. ఏదేమైనా ఒక చిన్న క్యారెక్టర్ చేసి దానికి కూడా రికార్డు రెమ్యూనరేషన్ తీసుకోవడం ఒక్క రజనీకాంత్ కే చెల్లింది. అన్నట్టు ఒక్క రజనీకాంత్ కే కాదు, శివరాజ్ కుమార్ కి, శివ కార్తికేయన్ కి కూడా భారీ రెమ్యునరేషన్ ను ఇస్తున్నారు. అలాగే మోహన్ లాల్ కి కూడా భారీగానే ముట్ట చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -