‘రైటర్ పద్మభూషణ్’ చిత్ర యూనిట్ ని నేచురల్ స్టార్ నాని అభినందించారు. సుహాస్ కథానాయకుడిగా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు.
చిన్న సినిమాగా విడుదలైన రైటర్ పద్మభూషణ్ పెద్ద విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల ప్రసంశలు అందుకుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మాస మహరాజ్ రవితేజ, నేషనల్ క్రష్ రష్మిక మందన రైటర్ పద్మభూషణ్ పై ప్రసంశల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా నేచురల్ స్టార్ నాని.. రైటర్ పద్మభూషణ్ చిత్ర యూనిట్ కు అభినందలు తెలిపారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘’ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. సుహాస్ నా ఫేవరేట్ యాక్టర్. స్క్రీన్ మీద వుంటే తన పెర్ ఫార్మెన్స్ అలా చూస్తూ వెళ్లిపోవచ్చు. రైటర్ పద్మ భూషణ్ సినిమా ఇంత గొప్పగా ఆడుతుంది. ఇంతమంది నించి ప్రసంశలు వస్తున్నాయి. న్యూ ఏజ్ సినిమాకి సపోర్ట్ చేస్తున్న టీం అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సుహాస్ కి అభినందనలు. ‘కలర్ ఫోటో’ కూడా థియేటర్ లో రావాల్సింది.. బ్లాక్ బస్టర్ అయ్యిండేది. కానీ అది రైటర్ పద్మభూషణ్ కి రాసి పెట్టినట్లు ఉంది. శరత్, అనురాగ్… నేను ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి సినిమాలు తీయాలని వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేశానో.. తెలుగులో అలాంటి సినిమాలని, ఆలోచలనలని, అలాంటి ప్రతిభని సక్సెస్ ఫుల్ గా ప్రోత్సహిస్తున్న మరో ప్రొడక్షన్ హౌస్ చాయ్ బిస్కెట్. చాయ్ బిస్కెట్ టీంకు కంగ్రాట్స్. చంద్రు గారికి కూడా కంగ్రాట్స్. దర్శకుడు ప్రశాంత్ కి కంగ్రాట్స్. ఎవరైనా ఇంకా చూడకపోయివుంటే ‘రైటర్ పద్మభూషణ్’ ని వెంటనే చూసేయండి’’ అని కోరారు. ‘రైటర్ పద్మభూషణ్’ ఘన విజయం సాధించి, పది రోజుల్లో పది కోట్లకు పైన గ్రాస్ వసూలు చేసి ప్రస్తుతం అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
ఇవి కూడా చదవండి..