కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చేరుకున్న సీఎం…అనంతరం కొండగట్టు అంజన్న క్షేత్రాన్నికి రోడ్డుమార్గంలో చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్. మంత్రులు, ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించారు.
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు. కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..