ఎండు ద్రాక్షతో ఉపయోగాలు!

84
- Advertisement -

చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు.. వంటి సమస్యలతో తరచూ భాదపడుతూ వుంటారు. ఇలాంటి సాధారణ సమస్యలను ఎదుర్కోవడానికి మన శరీరంలో తగినంగా రోగనిరోధకశక్తి అవసరం అవుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొండించడంలో డ్రై ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగ పడతాయి. డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ వాటన్నిటికంటే ఎండు ద్రాక్షలో పోషక విలువలు చాలా ఎక్కువ. ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షలో ఉండే ఔషధ గుణాల కారణంగా వివిధ రకాల హెల్త్ టానిక్స్ లలో కూడా ఎండు ద్రాక్ష రసాన్ని వాడుతూ ఉంటారు..

ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళుకు ఎండుద్రాక్ష అద్బుతమైన ఔషధంలా పని చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ప్రతిరోజూ 10-12 ఎండు ద్రాక్షలను రాత్రంతా నానబెట్టి వీటిని పేస్ట్ చేసుకొని ఉదయాన్నే పడగడుపున నేరుగా తీసుకోవడం వల్ల.. అజీర్తి, అల్సర్, వంటి సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ సాఫీగా జరుగుతుంది. ఇక ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసన ను తగ్గిస్తాయి. అందువల్ల నోటి దుర్వాసన అధికంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజూ 2-4 ఎండుద్రాక్షలు నోట్లో వేసుకొని నమిలి తినాలని నిపుణులు చెబుతున్నారు. హార్ట్ డీసీజ్ ఉన్నవాళ్ళు, అనీమియా సమస్యతో భాడపడే వాళ్ళు ప్రతిరోజూ ఎండుద్రాక్ష తినడం మంచిదట.

వీటిలో ఉండే కాల్షియం వల్ల ఎముకల పటుత్వం కూడా మెరుగుపడుతుంది. ఇక లోబిపి తో బాధ పడేవారికి కూడా ఎండుద్రాక్ష చక్కటి ఔషధంలా పని చేస్తుందట. ఎక్కడికెళ్లిన గుప్పెడు ఎండుద్రాక్షలను పట్టుకెళ్తూ బ్లేడ్ ప్రెజర్ తగ్గినప్పుడు వెంటనే 10 -15 ఎండు ద్రాక్షలను నమిలి తింటే బ్లేడ్ ప్రెజర్ సమతుల్యంగా ఉంటుంది. ఇక ఎండుద్రాక్షలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్, విటమిన్ ఏ కారణంగా కంటి సమస్యలు దూరం అయ్యి.. కంటి చూపు మెరుగుపడుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్న ఎండు ద్రాక్షలను తినడం ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:Kejriwal:జూ2న సరెండర్ అవుతా

- Advertisement -