వాట్ ఏ సర్ ప్రైజ్.. వాట్ నెక్స్ట్ మోడీజీ ?

31
- Advertisement -

ప్రస్తుతం ఉన్న మోడీ హయంలో స్వతంత్ర సంస్థలైన ఈడీ, సిబిఐ, ఐటీ వంటి సంస్థలు కేంద్రం గుప్పిట్లో ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఎంతటి అవినీతి పరులైన బీజేపీకి అనుకూలంగా ఉంటే వారిపై ఎలాంటి రైడింగ్ లు జరగవు. అలా కాకుండా కేంద్రం చేసే తప్పులను వేలెత్తి చూపితే వారిపై ఈడీ రైడ్లు, అవినీతి ఆరోపణలు ఇలా అన్నీ అస్త్రాలను మోడీ సర్కార్ వారిపై ప్రయోగిస్తుంది. ఈ కోవలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు.. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే కొందరు బి‌ఆర్‌ఎస్ నేతలు ఇలా చాలమందినే టార్గెట్ చేస్తూ వారిపై ఈడీ అస్త్రాలను ప్రయోగించింది కేంద్రం. .

దీంతో మోడీ పరిపాలనను ప్రశ్నిస్తే.. కేంద్ర దర్యాప్తు సంస్థల రైడింగ్ లు జరగడం పరిపాటిగా మారింది. ఇక తాజాగా ప్రముఖ మీడియా సంస్థ బీబీసి పై ఐటీ దాడులు చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ప్రధాని మోడీ పై ” ఇండియా : ది మోడీ క్వశ్చన్ ” అనే డాక్యుమెంటరీని రూపొందించిది. ఇది 2002 లో గుజరాత్ లో చోటు చేసుకున్నా అల్లర్ల నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ సాగడంతో దీనిపై కాషాయ పార్టీ నుంచి తీవ్ర అబ్యాంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించిన బీబీసి ని నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయగా సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. ఇది జరిగి కొన్ని రోజులు కూడా గడవక ముందే డిల్లీ లోని బీబీసి కార్యలయంపై ఐటీ సోదాలు నిర్వహించారు అధికారులు.

ఇలా ఐటీ దాడులు నిర్వహించడంపై కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా మోడీ సర్కార్ ను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇక తాజాగా బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ కూడా దీనిపై స్పందించారు. ” వాట్ ఏ సర్ ప్రైజ్.. ప్రధాని మోడీ పై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసిపై ఐటీ దాడులు జరిగాయి. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు కేంద్రం చేతిలో కీలు బొమ్మలుగా మారడం హాస్యాస్పదమే. వాట్ నెక్స్ట్ ? హిండెన్ బర్గ్ పై కూడా ఈడీ దాడులు ఉంటాయా ? లేదా టేకోవర్ చేసుకుంటారా ? ” అంటూ ట్విట్టర్ లో వ్యంగ్యస్త్రాలు సంధించారు కే‌టి‌ఆర్. మొత్తానికి మోడీ పాలనను వేలెత్తి చూపిన వారిపై.. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరగడం ఖాయం అని ఈ సంఘటనతో మరోసారి నిరూపితం అయిందనే చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -