కాంగ్రెస్, బీజేపీ.. దోస్తీ రాజకీయం!

55
- Advertisement -

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పై పైచేయి సాధించడం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బీజేపీ, బి‌ఆర్‌ఎస్ దోస్తీ ఖాయం అని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే.. కాదు కాదు కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ పార్టీలదే అసలైన దోస్తీ అని కమలనాథులు చెబుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బి‌ఆర్‌ఎస్ తో ఈ రెండు పార్టీలకు ఉన్న రాజకీయ వైరం గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకే ఈ రెండు పార్టీలు పొత్తు రాజకీయాలకు తెర తీశాయని పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. .

ఆ మద్య బి‌ఆర్‌ఎస్, బీజేపీ మద్య పొత్తు ఉండబోతుందని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించగా.. ఇటీవల బీజేపీ చీఫ్ బంటి సంజయ్ మాట్లాడుతూ బి‌ఆర్‌ఎస్ తో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలవబోతున్నాయని చెప్పుకొచ్చారు. ఇలా ఇరు పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఎలాంటి నిజం లేదనేది యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. అయినప్పటికి ఇలాంటి అసత్య ఆరోపణలు, విమర్శలు చేయడం రాజకీయాల్లో పరిపాటే. అయితే బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఇలాంటి అసత్య ఆరోపణలు ఎన్ని చేసిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది జగమెరిగిన సత్యం. కాగా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండడంతో ఎన్నికల నాటికి ఏ ఏ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయో చెప్పలేము. ప్రస్తుత పరిణామలు చూస్తుంటే బి‌ఆర్‌ఎస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ దోస్తీ కట్టిన ఆశ్చర్యం లేదనేది మరికొందరి వాదన. మరి మొత్తానికి తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మద్య పొత్తు రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -